ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. మధురవాడలో (Madhurawada) బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. వివరాలు.. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై బైక్‌‌పై వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొట్టింది. మృతులను పోలిపిల్లి రమణ, అతని భార్య రంబయ్, కుమార్తె శాంతి కుమారి‌గా గుర్తించారు. వీరు విజయనగరం జిల్లా పోలిపిల్లిలో బుధవారం ఓ ఫంక్షన్‌కు హాజరై గురువారం తెల్లవారుజామున తమ స్వగృహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదంలో ఇద్దరు మృతి..
విశాఖపట్నంలోని (visakhapatnam) తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై (Telugu Talli flyover) మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతులను జయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ (22), మురళీనగర్ మురళినగర్ ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న యువతి(17)గా గుర్తించారు. వివరాలు.. ప్రశాంత్ యువతితో కలిసి బైక్‌పై మంగళవారం సాయంత్రం ఆశీల్ మెట్ట నుండి కంచరపాలెం వైపు వెళ్తున్నారు. అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై వెళ్తున్న సమయంలో వీరి బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంద్దరు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో యువతి కూడా చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఇక, ప్రశాంత్ సీతమ్మధారలోని ఫ్యాషన్ వైబ్స్ లో సెలూన్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. యువతి నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.