ఏలూరు జిల్లా పట్టిసీమలో మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి వేళ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
ఏలూరు జిల్లా పట్టిసీమలో మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి వేళ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ముగ్గురు యువకులు శివరాత్రి సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉత్సవాలను చూసేందుకు వచ్చారు. అయితే గోదావరి నదిలో స్నానానికి దిగిన సమయంలో నది ప్రవాహానికి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
