కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. విశాఖ నుంచి కోరుకొండ మండలం శ్రీరంగ పట్నం వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక, ప్రమాద స్థలంలోనే ఒక్కరు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.
మృతులు, గాయపడినవారంతా శ్రీరంగ పట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కళాకారులని.. విశాఖ మార్కాపురం వద్ద నిన్న రాత్రి నాటకం ప్రదర్శించారని చెప్పారు. అనంతరం తిరిగి శ్రీరంగపట్నం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలిపారు.
