మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ ఏపీ రాష్ట్రంలోని  రామవరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం నాడు రాస్తారోకో నిర్వహించారు. 

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామవరం వద్ద మూడు రాజధానులను నిరసిస్తూ సోమవారం నాడు జేఎసీ నేతలు ఆందోళనలకు దిగారు.

మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ జ్యోతుల నవీన్ కుమార్‌ ఆధ్వర్యంలో జేఎసీ నేతలు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.

టైర్లను దగ్దం చేయడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జాతీయ రహాదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేయడంతో వాహనదారుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.