కోర్టు పరిధిలో ఉంది:ఏపీ రాజధానిపై కేంద్రం మరో ట్విస్ట్

ఏపీ రాజధానిపై  గతంలో ఇచ్చిన సమాధానాన్ని కేంద్రహోంశాఖ సరిదిద్దుకొంది. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపింది.

three capitals issue pending in court says union home ministry lns

న్యూఢిల్లీ: ఏపీ రాజధానిపై  గతంలో ఇచ్చిన సమాధానాన్ని కేంద్రహోంశాఖ సరిదిద్దుకొంది. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపింది.ఏపీలో మూడు రాజధానుల అంశంపై చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేశాడు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇచ్చాడు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళత అభివృద్ది చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలుంటాయని తెలిపింది.వీటిని రాజధానులు అంటారని  వివరించింది. రాష్ట్ర రాజధానిని  ఆ రాష్ట్రమే నిర్ణయించుకొంటుందని పేర్కొంది.ఈ సమాధానంపై  అమరావతి జేఏసీ ఛైర్మెన్ జివిఆర్ శాస్త్రి అభ్యంతరం తెలిపారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ అప్పిలేట్ అథారిటీగా వ్యవహరిస్తున్న సంయుక్త కార్యదర్శి ప్రకాష్ కు ఈ నెల 9న లేఖ రాశాడు. 

క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరపున సీపీఐవో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.  అయితే ఈ లేఖకు కేంద్రం తరపున సీపీఐవో  మరో లేఖ పంపారు. గతంలో ఆర్టీఏ ధరఖాస్తుకు ఇచ్చిన సమాధానానికి భిన్నమైన సమాధానం ఇచ్చింది కేంద్రం. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని సీపీఐవో  ఆ లేఖలో పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios