అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డిఎ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే శాసన మండలి చైర్మన్ నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యామ్నాయాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే చైర్మన్ నిర్ణయంతో వాటిని అమలులోకి తేవడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై వైఎస్ జగన్ కి, విజయసాయి రెడ్డికి మధ్య  చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్‌కు షాక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

మూజు వాణీ ఓటుతో గానీ, ఓటింగ్ పెట్టి గానీ కాకుండా తన విచక్షణాధికారాలతో చైర్మన్ వాటిని సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపించాలనే చైర్మన్ నిర్ణయాన్ని అమలు చేయాలా, వద్దా అనే విషయంపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయాలపై వారు దృష్టి కేంద్రీకరించారు.

ఆర్డినెన్స్ తీసుకుని వస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా వారిద్దరు చర్చించారు. బిల్లులు శాసన మండలికి వచ్చిన నేపథ్యంలో రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికరమైన పరిణామాలు కూడా జరిగాయి. 

Also Read: మండలి గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ: ఫ్రేమ్ లో చంద్రబాబు సైతం

ఇదిలావుంటే, ఈ బిల్లులపై ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇద్దరు ఎమ్మెల్సీలు బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఓటింగ్ సమయానికి మరింత మంది టీడీపీ సభ్యులను తమ వైపు లాగేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది.