ఏపీ శాసనమండలిలో  పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులపై చర్చ పూర్తైన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ డిమాండ్ చేసింది. 

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై బుధవారం నాడు సాయంత్రం చర్చ ముగిసింది. అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

బుధవారం నాడు ఉదయం నుండి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ ప్రారంభమైంది. పడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఆ తర్వాత పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. బుధవారం నాడు సాయంత్రానికి ఈ విషయమై చర్చలు పూర్తయ్యాయి.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

చర్చ ముగిసిన తర్వాత ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కోరారు. అయితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

ఈ విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనే విషయమై ఓటింగ్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కోరారు.

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

ఈ రెండు బిల్లులపై సవరణలు కోరుతూ తనకు టీడీపీ సభ్యులు నోటీసులు ఇచ్చారని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ సభలో ప్రకటించారు. దీంతో శాసనమండలి ఛైర్మెన్ షరీప్ తీరుపై అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.