Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్టణంలో జిల్లాలో మత్తు ఇంజక్షన్ల కలకలం: ముగ్గురి అరెస్ట్

విశాఖపట్టణం జిల్లాలోని యాదవ జగ్గరాజుపేటలో గల పాత ఇనుము  దుకాణంలో  మత్తు ఇంజక్షన్లు లభ్యమయ్యాయి.  మత్తు ఇంజక్షన్లను  విక్రయిస్తున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. 

Three arrested police arrested  with  ganja in  Visakhapatnam  District
Author
First Published Jan 19, 2023, 9:54 AM IST

విశాఖపట్టణం:  జిల్లాలోని   యాదవ జగ్గరాజుపేటలో గల  పాత ఇనుము దుకాణంలో  మత్తు ఇంజక్షన్లు  కలకలం రేపాయి. స్క్రాప్ దుకాణంలో  మత్తు ఇంజక్షన్లతో పాటు గంజాయిని కూడా విక్రియస్తున్నారని  పోలీసులు గుర్తించారు.  స్థానికులు  ఇచ్చిన  సమాచారం మేరకు  పోలీసులు  బుధవారం నాడు సాయంత్రం  ఈ   దుకాణంపై దాడి చేశారు.  ఈ దుకాణంలో  ఉన్న  35 మత్తు ఇంజక్షన్లను  పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు  సిగరెట్లలో  వినియోగించేందుకు  సిద్దంగా  ఉన్న  గంజాయి పౌడర్ ను   పోలీసులు సీజ్ చేశారు. మత్తు ఇంజక్షన్లు,  గంజాయి పౌడర్ విక్రయానికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. 

పాత ఇనుము దుకాణం వద్దకు  కాలేజీ విద్యార్ధులతో పాటు  పలువురు పెద్ద ఎత్తున వచ్చేవారు.  ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దొంగతనాలు  చోటు  చేసుకుంటున్నాయని  స్థానికులు ఆరోపిస్తున్నారు.  స్క్రాప్ దుకాణంలో  గంజాయి విక్రయిస్తున్నారని  గుర్తించిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు   సోదాలు నిర్వహించడంతో  మత్తు ఇంజక్షన్లు  విక్రయిస్తున్న విషయం వెలుగు చూసింది. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి మత్తు ఇంజక్షన్లను  తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు  గుర్తించారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన  అనుపమ్ అధికారి పరారీలో ఉన్నాడు.  పాత ఇనుము దుకాణంలో  మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న కేసులో 
నక్కా మహేశ్వర్ రెడ్డి, మండె చైతన్య,, శ్రీరాంరెడ్డిలను  పోలీసులు అరెస్ట్  చేశారు. పాత ఇనుము దుకాణం పక్కనే పార్క్   చేసి న కారులో  కూడా  మత్తు ఇంజక్షన్లను  స్థానికులు గుర్తించారు.  వీటిని స్థానికులు పోలీసులకు అప్పగించనున్నారు.ఈ కారు మహేశ్వర్ రెడ్డిదిగా  స్థానికులు  చెబుతున్నారు.  

విశాఖపట్టణంలో  మత్తు ఇంజక్షన్లు  విక్రయిస్తున్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేసిన  ఘటనలు గతంలో కూడా  చోటు చేసుకున్నాయి.  2022 మే 5వ తేదీన   జిల్లాలోని భీమిలి, లీలా మహల్   వంటి ప్రాంతాల్లో మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న  ఇద్దరిని పోలీసులు అరెస్ట్  చేశారు. బెంగాల్ రాష్ట్రం నుండి ఈ ఇంజక్షన్లను తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.  తరచుగా  ఈ తరహ ఘటనలు విశాఖపట్టణంలో చోటు చేసుకోవడంతో  స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మత్తు ఇంజక్షన్లు, గంజాయి  సరఫరా చేసే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు  డిమాండ్  చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios