పెద్దిరెడ్డి చంద్రబాబు పై విమర్శలు. గెలుపు కాదు వాపు అన్న పెద్ది రెడ్డి. డబ్బులతో మభ్యపెట్టి గెలిచారన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల్లో మోసం చేసి గెలిచింద‌ని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజలను మోసం చేసి గెలిచిన చంద్రబాబు ప్రజల అభిమానం సంపాదించి గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. "ఈ విజయాలను చూసి బలం అనుకుంటున్నావేమో.. కానేకాదు అది కేవ‌లం వాపు మాత్రమేనని" అన్నారు. సోమవారం ఆయ‌న‌ హైద‌రాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. 


ఎన్నిక‌ల్లో రూ.200 కోట్లు రూపాయ‌లు టీడీపీ వెదజల్లింద‌ని ఆరోపించారు. ఓటుకు రూ.2వేల నుంచి రూ.10వేలు పంచారని ఆయ‌న చెప్పారు. పోలీసులను ముఖ్య‌మంత్రి తన సొంత పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకున్నారని విమ‌ర్శించారు, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులనే కాక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను కూడా ఉప ఎన్నికలు జరిగిన చోట్ల వాడుకున్నార‌ని ఎద్దేవా చేశారు. పోలీసు బాసులు పార్టీ కార్యకర్త మాదిరిగా పనిచేయించడం రాష్ట్రమంతా గమనించిందన్నారు. అభిమానం అనేది ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తే వ‌స్తుంది, కానీ చంద్రబాబు మాత్రం బెదిరింపుల‌తో సంపాదిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...