Asianet News TeluguAsianet News Telugu

‘దేశం’లో పెద్ద మనుషులు

తెలుగుదేశంపార్టీలోని డిఫాల్టర్లు, కబ్జాకోరుల యవ్వారాలు ఒక్కోటిగా బయట పడుతున్నాయి.

This is naidus army of defaulters

తెలుగుదేశంపార్టీలోని డిఫాల్టర్లు, కబ్జాకోరుల యవ్వారాలు ఒక్కోటిగా బయట పడుతున్నాయి. అది కూడా ఎన్నికల సందర్భంగా కావటం విచిత్రంగా ఉంది. నిజానికి పోటీ చేయాలనుకున్న వారిపై ఓ చిన్న కేసున్నా ఎన్నికల్లో పోటికి అనర్హులే. అటువంటిది వందల కోట్ల రుణాలు ఎగవేత కేసులో ఒకరు, కోట్లాది రూపాయలు విలువచేసే భూకబ్జా కేసులో మరొకరు ఇరుకున్నారు. అసలైతే వీరికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకపోయినా వీరికి టిక్కెట్లు ఎలా ఇచ్చారు? వీరి నామినేషన్లు ఎలా చెల్లుబాటయ్యాయో నిప్పు చంద్రబాబే చెప్పాలి.

 

అనంతపురం జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీగా పోటిచేసిన దీపక్ రెడ్డి హైదరాబాద్లో ఓ స్ధలాన్ని కబ్జా చేసిన కేసులో ఇరుక్కున్నారు. తప్పుడు పత్రాలతో భూకబ్జాకు పాల్పడ్డారని  దీపక్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఇక, నెల్లూరు జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీగా పోటి చేస్తున్న వాకాటి నారాయణ రెడ్డి చరిత్ర కూడా ఘనమైనదే. ఏకంగా నాలుగు బ్యాంకుల్లో సుమారు రూ. 443 కోట్లు ఎగొట్టిన కేసులో ఇరుకున్నారు. వేరే కంపెనీలకు హామీ వుండి రుణాలు ఇప్పించారట. అవి ఎగొట్టినందుకు వాకాటిపైన కేసులు పడ్డాయట. నిమ్మేట్లుగా ఉన్నాయా? ఏదో కంపెనీలకు ఎవరైనా వందల కోట్ల రుణాలకు హామీలుగా ఉంటారా?

 

ఇటీవలే మంత్రి  గంటా శ్రీనివాసరావు వ్యవహారం కూడా రచ్చకెక్కిన సంగతి అందరకీ గుర్తుండే ఉంటుంది. ఆయన కూడా ఏదో కంపెనీకి వందల కోట్లు హామీవున్నారట. సదరు కంపెనీ రుణాలు చెల్లించకపోతే ఆ కేసు తనపై పడిందని గంటా కూడా ఎంత అమాయకంగా చెప్పారో? అదే పద్దతిలో భారీ కాంట్రాక్టులు చేస్తున్న రాయపాటి ఎగ్గొట్టిన బ్యాంకులోన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. టిడిపిలో తిరుగుతున్న వైసీపీ ఎంపి కొత్తపల్లి గీతదీ అదేదారి. ఇక, కేంద్రమంత్రి సుజనా చౌదరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈయనపై నాంపల్లి కోర్టు ఏకంగా నాన్ బైలబుల్ వారెంటే ఇచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు సుజనా ఘనత గురించి. ఇప్పటికి బయటపడింది వీరే. బయటపడని వారు ఇంకెంతమందున్నారో?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios