కర్నూలు జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల  సుబ్రమణ్యం వ్యవసాయ కూలీ  విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు . లైన్మేన్ పోల్ ఎక్కి చేయవలసిన పనిని వ్యవసాయ కూలీలతో చేయించారు.  స్తంభం ఎక్కి వైర్లను తాకగానే ఇలా మృత్యువాత పడ్డాడు.

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక రైతు కూలీ ప్రాణానికొచ్చింది.

సుబ్రమణ్యం అనే వ్యవసాయ కూలీ విద్యుత్ స్తంభం ఎక్కి కరెంటు షాక్ తగలడంతో ఇలా చచ్చిపోయాడు.

ఆయన కరెంటు స్తంభం ఎందుకెక్కాడు?

లైన్ మెన్ పోల్ ఎక్కి చేయవలసిన పనిని వ్యవసాయ కూలీలతో చేయ్యించడంతో ఈ ఘాతుకం జరిగింది.