మంత్రులు ఎంఎల్ఏల ఫోన్లు ఎత్తకపోతే ఆ విషయం జనాల్లో నెగిటివ్ గా పాకిపోతుంది. ఎంఎల్ఏల పోన్లే మంత్రులు ఎత్తటం లేదంటే నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు విలువేంవుంటుంది?
తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎంఎల్ఏ పితాని సత్యనారాయణ మంత్రులు చేస్తున్న ప్రజాసేవ గురించి చక్కగా వివరించారు. ఆచంటలో జరిగిన ఓ కార్యక్రమంలో పితాని మాట్లాడుతూ, మంత్రుల్లో అత్యధికులు ఎంఎల్ఏల ఫోన్లే ఎత్తటం లేదట. మంత్రులందరిలోకి కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే అందరికీ అందబాటులో ఉంటున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
మంత్రులు అటు సచివాలయంలోనూ అందుబాటులో లేకుండా ఇటు జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకుండా మరి ఎక్కడ తిరుగుతున్నట్లు? ఎంఎల్ఏలకు కూడా అందుబాటులో లేకండా మంత్రులు చేస్తున్న ప్రజాసేవ ఎమిటో పితాని వివరిస్తే బాగుండేది.
ప్రజాప్రతినిధులకు నిత్యం ఎన్నో పనులుంటాయి. నియోజకవర్గాల్లో తిరుగుతున్నపుడు ఎందరో అర్జీలిస్తుంటారు. అవసరమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకనే ప్రజల ఎదురుగానే పలువురు ఎంఎల్ఏలు మంత్రులకు ఫోన్లు చేయటం మామూలే. అయితే, మంత్రులు ఎంఎల్ఏల ఫోన్లు ఎత్తకపోతే ఆ విషయం జనాల్లో నెగిటివ్ గా పాకిపోతుంది. ఎంఎల్ఏల పోన్లే మంత్రులు ఎత్తటం లేదంటే నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు విలువేంవుంటుంది? పక్కనే హోమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఉన్నపుడే పితాని విషయం చెప్పారులేండి.
ఇదే విషయంపై చంద్రబాబునాయుడు మంత్రులకు ఎన్నోమార్లు క్లాసులు కూడా పీకారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎంఎల్ఏలు ఫోన్లు చేస్తే వెంటనే మాట్లాడటమే కాకుండా వారు చెప్పే పనులపై దృష్టి పెట్టాలని చెప్పారు. పలువురు శాసనసభ్యులు గతంలో చంద్రబాబుకు మంత్రులపై స్వయంగా ఫిర్యాదు కూడా చేసారు. పితాని అసంతృప్తి కావచ్చు లేదా ఫిర్యాదూ కావచ్చు మంత్రుల్లో అయితే ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం అర్ధమవుతోంది. పితాని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసారులేండి. మరి అప్పుడు ఆయన ఏ మేరకు ఎంఎల్ఏల ఫోన్లు ఎత్తుతూ ప్రజలకు ఎంతవరకూ అందుబాటులో ఉన్నారో?
