తెలుగుదేశంకు సేవచేసేందుకు ఐఎ ఎస్ లు, మాజీ లు తెగ ఉబలాటపడుతున్నారు
రాజకీయ నాయకులకు సేవ చేసి చేసి ఐఎఎస్ అధికారులు కూడా పదవులంటే తెగ కక్కుర్తి పడుతుంటారు.
ప్రభుత్వ వ్యవస్థలో దాదాపు మూడున్నర దశాబ్దాలు ప్రతిదీ ప్రజాధనం నుంచి పొందాక, హ్యీపీగా రిటైర్ అయిపోయి, విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడే సమస్యంతా వచ్చింది. ఇంతకాలం దర్జా వెలగబెట్టి రిటైరయ్యాక అనామకుడిగా బతికేందుకు బాగా భయపడేది ఐఎఎస్ వాళ్లే.
అందుకే చివరిరోజుల్లో ముఖ్యమంత్రులకు చేయరానిపనులన్నీ చేసి రిటైరయ్యాక కూడా ఏదో ఒక ప్రభుత్వ పదవిలో కొనసాగేందుకు చూస్తారు.రాష్ట్రంలో అడ్వయిజర్ హోదాలో క్యాబినెట్ ర్యాంకు పొందుతారు. రాజకీయ సేవ కొనసాగిస్తూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు అంకితమయి సేవచేస్తూ కనబడుతుంటారు.
రాష్ట్రంలో రిటైరయిన చీఫ్ సెక్రెటరీలకు పునరావాసం ఇలా వచ్చిందే.
ఇలా పునరావాసం పొందిన చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు. రిటైరయిపోగానే ఆయన రాష్ట్ర బ్రహ్మణ కార్పొరేషన్ ఛెయిర్మన్ అయ్యారు. అయితే, అక్కడి తో కథ ఆగడం లేదు.ఆయన2019 ఎన్నికలలో విజయవాడనుంచో మరొక చోట నుంచే లోక సభకు బ్రాహ్మణ ప్రతినిధిగా పోటీ చేయానుకుంటున్నారట. అందుకని బ్రాహ్మణుల తోపాటు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి కూ డా కాస్త సేవ చేయాలనుకుని ఇపుడు వార్తలకెక్కారు.
ఛెయిర్మన్ గా ఉంటూ ఆయన విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం-బిజెపి అభ్యర్థుల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ ఎన్నిక మార్చి 7న జరుగునుంది. ఇది చట్ట వ్యతిరేకం కాదా.
ఈ విషయాన్ని ప్రతిపక్ష సభ్యలెవరో కనిపెట్ట లేదు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్రంలో సెక్రెటరీ గా పనిచేసి రిటైరయి, మానవ, పర్యావరణ హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఇఎఎస్ శర్మ ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ జీతం తీసుకుంటూ టిడిపి-బిజిపి అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని ఆయన ఎన్నికల ప్రధానాధికారి బన్వర్ లాల్ కు ఈ రోజొక లేఖ రాశారు. అది మోడల్ కోడ్ కు వ్యతిరేకమని, ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని ఆయన లేఖలోపేర్కొన్నారు.
అంతేకాదు, ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఖర్చు చేసి వైజాగ్ వచ్చాడని, అది అధికారదుర్వినియోగమే అవుతుందని, ప్రజల సొమ్మును పక్కదారులకు మళ్లించడమే అవుతుందని శర్మ ఈ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇలా చట్టం ఉల్లంఘించడం పట్ల ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేసి దీనిమీద విచారణ జరిపి తగినచర్యలు తీసుకోవాలని బన్వర్ లాల్ ను కోరారు.
