అన్న క్యాంటీన్ దౌర్భాగ్యం: ముక్కు మూసుకుని... (ఫొటో)

This Anna canteen fate
Highlights

అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

అనకాపల్లి: అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదు రూపాయలకే భోజనం పెట్టే ఈ క్యాంటీన్లకు విశేష ఆదరణ ఉంటుందని భావించి, వచ్చే ఎన్నికల్లో తురుపు ముక్కగా దాన్ని వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అన్న క్యాంటీన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మార్చురీ  పక్కనే   ఎన్టీఆర్ క్యాంటిన్  పెట్టారు. కనీసమైన అవగాహన లేకుండా ఆ క్యాంటీన్ ను ఏర్పాటు చేశారనేది అర్థమవుతూనే ఉంది. 

మార్చురీ నుండి వచ్చే  దుర్వాసన  భరిస్తూ పేదలు  కడుపు నింపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముక్కుకు దస్తీలు, చేతులు అడ్డం పెట్టుకుని ఉన్న ప్రజలను చూస్తే అది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

loader