కువైట్ నుంచి వచ్చిన మహిళ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్ వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్ వచ్చిందని, మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా : Andhra Pradesh లో మూడో Omicron case నమోదయ్యింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈ నెల 19న Kuwait నుంచి విజయవాడకు చేరుకుంది. విజయవాడ మీదుగా కారులో స్వస్థలం అయినవిల్లికి వచ్చింది మహిళ వచ్చింది.
గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు
ఆమె నమూనాలను Genome sequencing కు పంపగా ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్ వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్ వచ్చిందని, మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్.. సెల్ఫ్ లాక్ డౌన్ లో గూడెం గ్రామం..
కాగా, రెండు రోజుల క్రితం డిసెంబర్ 22న Andhra pradesh రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. kenya నుండి తిరుపతికి వచ్చిన మహిళకు Omicron నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. ఈ నెల 12న ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆమె శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షల్లో ఆ మహిళకు కరోనా ఒమిక్రాన్ సోకిందని తేలింది.
ఈ నెల 10న కెన్యా నుండి చెన్నైకి అక్కడి నుండి Tirupati కి 39 ఏళ్ల మహిళ వచ్చిందని ఏపీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. తిరుపతిలో ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో విదేశాల నుండి వచ్చిన 45 మంది ప్రయాణీకులు ఏపీకి వచ్చారు. వారిలో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు ఈ నెల 12న నమోదైంది. ఐర్లాండ్ నుండి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. Vizianagaram జిల్లాకు వచ్చిన ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో ఆయనతో కాంటాక్టులోకి వెళ్లిన ఆయన బంధువులకి కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తిని కూడా ఐసోలేషన్ కు తరలించారు.
కాగా, డిసెంబర్ 13న ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఒమిక్రాన్ వేరియంట్ అనేక దేశాలకు తన ఉనికిని విస్తరిస్తోంది. భారత్ లో నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ మొదటి కేసు నమోదయ్యింది. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున ఐదు తాజా కేసులు వెలుగులోకి రావడంతో డిసెంబర్ 13 నాటికి భారతదేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య 38కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు చండీగఢ్‌లోనూ ఇవే మొదటి కేసులు.
