అనంతపురం:అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు.శుక్రవారం నాడు బ్యాంకు ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించారు.

అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో  కోపరేటివ్ బ్యాంకులో స్ట్రాంగ్ రూమ్‌ను పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. రెండు లాకర్లను పగుల గొట్టారు.శుక్రవారం నాడు ఉదయం బ్యాంకుకు వెళ్లిన ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఓపెన్  చేసిన రెండు లాకర్లకు సంబంధించిన యజమానులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.