విజయవాడలో దారుణం, పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

First Published 13, Jul 2018, 5:28 PM IST
Thieves Attack Woman With Knives In vijayawada
Highlights

విజయవాడ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  సత్యనారాయణ పురంలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతుకోసి దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఆమె అరుపులను విని స్థానికులు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగింది. ఆచార్యవీధి లో ఓ ఇంట్లో ఒంటరి మహిళను గమనించిన దుండగులు మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు.అయితే వీరిని ఇంట్లో ఉన్న పద్మావతి అనే మహిళ అడ్డుకోడానికి ప్రయత్నించింది. దీంతో వారు తమతోపాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశారు. దీంతో ఆమె అరవడంతో చుట్టుపక్కల వారు ఆ ఇంటి వైపు వస్తుండడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు.

రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న పద్మవతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  ఆమెకు చికిత్స అందిస్తున్నామని,ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, జాగిలాలను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సిసి టీవి పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇది దోపిడీ దొంగల పనేనని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

loader