హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై సినీనటుడు అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. తాను వైఎస్ జగన్ కలవడంలో ఎలాంట రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. 

వైఎస్ జగన్ తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జగన్ ను సాధారణంగానే కలిశానని అందులో ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. తాను ఇతరుల టికెట్ కోసం జగన్ తో చర్చించేందుకు వచ్చానన్న వార్తలు కూడా వాస్తవం కాదన్నారు. 

వైఎస్ జగన్ ఏపీలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు  కింగ్ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. 

అంతేకాదు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రాబోయే  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఇప్పటి వరకు స్పందించని నాగార్జున వైఎస్ జగన్ తో భేటీ అనంతరం స్పందించడం విశేషం.  
 

ఈ వార్తలు కూడా చదవండి

అంతమాత్రాన పార్టీలో చేరిపోతారా..?: జగన్ తో నాగార్జున భేటీపై గల్లా జయదేవ్

జగన్ సైడ్ అక్కినేని నాగార్జున: కేటీఆర్ ప్లాన్, వైఎస్ తో అనుబంధం

జగన్ వెంటే మేమంటున్న టాలీవుడ్ స్టార్స్!

వైసీపీలోకి అక్కినేని నాగార్జున: వైఎస్ జగన్ తో భేటీ