భర్త వేధింపులు రోజు రోజుకు ఎక్కువయిపోతుండటంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది. దీంతో క్షణికావేశంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరిగింది.
వారిది ప్రేమ వివాహం. దాదాపు 11 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఈ జంటకు ఒక కుమారుడు జన్మించారు. ఆ బాబు వయస్సు 5 సంవత్సరాలు. సవ్యంగా సాగిపోతున్న జీవితం. అయితే వీరి జీవితాల్లోకి మద్యం రూపంలో ఓ శత్రువు ప్రవేశించింది. భర్త తాగుడికి బానిసయ్యాడు. ఈ వ్యసనం వల్ల భర్త ప్రవర్తనలో తేడా వచ్చింది. భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్త వేధింపులు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఆమె భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రిష్టిపాటి క్రిష్ణారెడ్డి (31) ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గాజులపాలెంకు వ్యక్తి. ఆయన సంతనూతలపాడుకు చెందిన రుక్మిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2011 సంవత్సరంలో జరిగింది. ఈ జంట సంతనూతలపాడులో నివసిస్తోంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
కొన్నేళ్ల నుంచి భర్త క్రిష్ణారెడ్డి తాగుడికి బానిసయ్యాడు. అప్పటి నుంచి భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఇలాగే జరుగుతూ వస్తోంది. దీంతో ఈ జంట మధ్య గొడవలు జరగడం ప్రారంభించాయి. గత మూడు రోజులుగా ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భర్త శారీరకంగానూ హింసించడం ప్రారంభించాడు. సోమవారం రాత్రి కూడా తొగొచ్చి భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెకు కోపం వచ్చి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
అనంతరం బయటకు వచ్చి ఇంటికి తలుపులకు గడియపెట్టేసింది. దీంతో క్రిష్ణారెడ్డి ఆ ఇంట్లోనే పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి హారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం భార్య రుక్మిణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.
