తిరుమలలో బోనులో చిక్కిన ఆరో చిరుత.. లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే..

తిరుమలలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో ఇప్పటి వరకు బంధించిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కుకుంది.

The sixth leopard trapped in a cage in Tirumala.. in the same area where it attacked Lakshita..ISR

తిరుమలలో ఆరో చిరుత బోనులో పడింది. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది. గత కొన్ని రోజులుగా ఆ మృగం సంచారాన్ని గుర్తించి, అధికారులు బోనులు ఏర్పాట్లు చేశారు. అందులో స్వామి వారి ఆలయానికి వెళ్లే నడకదారిలో ఉంచిన దాంట్లో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.

పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..

కాగా.. ఈ చిరుతను జూపార్క్ లో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం  అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అధికారులు ఆరు చిరుతలను పట్టుకున్నారు. బుధవారం పట్టుబడిన చిరుతతో ఆ సంఖ్య ఆరుకు చేరింది.

ప్రేమించడం లేదని యువతిపై కోపం.. దారుణ హత్య.. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఘటన

గత గురువారం తిరుమల అలిపిరి నడకమార్గంలో ఐదో చిరుతను గురువారం అటవీశాఖ అధికారులు బంధించారు. నరసింహస్వామి ఆలయం, ఏడవకు మైలు రాయి మధ్యలో అటవీశాఖ అధికారులు చిరుతను ట్రాప్ చేశారు. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. ఈ బోన్లో చిరుత చిక్కింది.  అయితే సెప్టెంబర్ 7న నాలుగో చిరుత చిక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios