Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడే తెచ్చిస్తామని కారు తీసుకెళ్తారు.. పత్తా లేకుండా పోతారు.. కిలాడీల గుట్టురట్టు చేసిన పోలీసులు

అద్దెకు కారు తీసుకెళ్లి వాటిని అమ్మేస్తున్న ముగ్గురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. 

The police have arrested three people who were taking the car and selling it
Author
First Published Nov 24, 2022, 12:34 PM IST

అతడో యాక్టింగ్ కారు డ్రైవర్. ఆయనకు భార్య, అక్కా ఉన్నారు. తెలిసిన వారి దగ్గరి నుంచి కారు తీసుకెళ్లడం, ఇప్పుడే తీసుకొని వస్తాం అని చెప్పి వాటిని విక్రయించడం వారికి అలవాటు. అయితే ఇలాంటి మోసాలు ఎన్నో రోజులు సాగవు కదా.. ఇక్కడే అదే జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సిట్ నోటీసు

కార్ల మోసానికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన డి.యుగంధర్‌ భార్య అనిత, అక్క మంజులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీవాసమూర్తి, సీఐ నరిసింహరాజు బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యాక్టింగ్ డ్రైవర్ గా పని చేసే యుగంధర్ విలాసాలకు అలవాటు పడ్డాడు. కార్లు అద్దెకు అడిగితే ఇతరుల దగ్గర వాహనాలను తీసుకొని వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో  కొంత కాలం నుంచి ముగ్గురు నిందితులు తెలిసి వాళ్ల దగ్గరకు వెళ్లి.. తొందరగానే తెచ్చిస్తామని చెప్పి కార్లను తీసుకుంటున్నాడు. వాటిని అమ్మేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు.

లింగ మార్పిడి చికిత్సతో స్త్రీగా మార్పు.. త్వరలోనే లింగ సవరణతో కూడిన పాస్‌పోర్టు జారీ..!

ఇలా వీరి చేతిలో మోసానికి గురైన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్లను యుగంధర్ అద్దెకు తీసుకున్నాడని, తరువాత వాటిని ఇవ్వకుండా కనిపించకుండా తిరుగుతున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా నిందితుడు కార్లను తాకట్టు పెడుతున్నాడని, మంచి ధరలు వస్తే వాటిని అమ్మేస్తున్నాడని గుర్తించారు. 

పల్నాడు జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మృతి

కాగా.. కాజూరు చౌరస్తాలో ఎస్ఐ మల్లికార్జున్ ఆధ్వర్యంలో వెహికిల్ చెకింగ్స్ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో యుగంధర్ ఓ కారులో చిత్తూరు వైపునకు వస్తున్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోదామని అనుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీంతో అసలు విషయం పోలీసులకు అర్థం అయ్యింది. తన అక్క, భార్యతో కలిసి ఇలాంటి నేరాలు చేస్తున్నానని నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల నుంచి మొత్తంగా మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios