Asianet News TeluguAsianet News Telugu

పల్నాడు జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మృతి

పల్నాడు జిల్లా  కారంపూడి ఇందిరానగర్  లో గురువారంనాడు విద్యుత్  షాక్  తో  తల్లీ కొడుకు  మృతి చెందారు.

Mother  and Son  die  After  electrocution  In  Palnadu  District
Author
First Published Nov 24, 2022, 12:26 PM IST

గుంటూరు:పల్నాడు  జిల్లా  కారంపూడి  ఇందిరానగర్ లో  గురువారంనాడు  విషాదం  చోటు  చేసుకుంది.  విద్యుత్  షాక్  తో  తల్లీ  కొడుకు  మృతి  చెందారు. ఇంట్లో  ఇనుప తీగపై  అంగడి నాగమ్మ  బట్టలు  ఆరవేస్తున్న  సమయంలో  విద్యుత్  షాక్  తగిలింది.  దీంతో  గట్టిగా  కేకలు  వేసింది.  తల్లిని కాపాడేందుకు కొడుకు  రామకోటేశ్వరరావు  వెళ్లాడు.ఆమెను కాపాడే  ప్రయత్నంలో  రామకోటేశ్వరరావుకు  కూడా విద్యుత్  షాక్ కు  గురయ్యాడు.ఈ  ప్రమాదంలో  వీరిద్దరూ  మృతి  చెందారు. విద్యుత్  షాక్  తో తల్లీ కొడుకు మృతి  చెందడంతో  ఆ కుటుంబంలో  విషాదం  నెలకొంది. 

విద్యుత్  షాక్  తో  పలువురు  మృతి  చెందిన  ఘటనలు  గతంలో  కూడా  రెండు  తెలుగు  రాష్ట్రాల్లో చోటు  చేసుకున్నాయి.  తెలంగాణలోని  మెట్  పల్లిలో విద్యుత్  షాక్  తో  ఇద్దరు  మృతి  చెందిన  ఘటన ఈ  ఏడాది సెప్టెంబర్  27న  చోటు  చేసుకుంది. స్నేహితుడి దుకాణం  వద్ద  బోర్డును మారుస్తున్న  సమయంలో  విద్యుత్  షాక్  తో  ఇద్దరు  మరణించారు. మరణించిన  ఇద్దరు  కూడా స్నేహితులు.  

ఈ ఏడాది ఆగస్టు  31న  మంచిర్యాల మండలం బొప్పారంలో  విద్యుత్  షాక్  తో  ఇద్దరు  చనిపోయారు. వ్యవసాయ పొలం  వద్ద భార్యా, కొడుకు  విద్యుత్ షాక్ కు గురయ్యారు.  అయితే  వీరిద్దరిని కాపాడే  క్రమంలో  భర్త  కూడా  విద్యుత్  షాక్ కు గురయ్యాడు.  భార్య, కొడుకు  మరణించారు.  భర్త ప్రాణాలతో బయటపడ్డారు.

also  read:అనంతలో ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు: 30 మంది ప్రయాణీకులు సురక్షితం

కామారెడ్డి  జిల్లాలోని బీడి  వర్కర్స్ కాలనీలో  విద్యుత్  షాక్  తో   నలుగురు  మృతి  చెందారు. బట్టలు  ఆరవేస్తున్న  సమయలో  పర్వీన్ విద్యుత్  షాక్ కు  గురైంది.  ఆమె రక్షించే క్రమంలో  భర్త  విద్యుత్ కు  గురై  మరణించాడు. తల్లిదండ్రులను పట్టుకుని ఇద్దరు  పిల్లలు కూడా  చనిపోయారు. ఈ ఘటన ఈ  ఏడాది  జూలై  12న  చోటు  చేసుకుంది.మహబూబాబాద్  జిల్లా డోర్నకల్ మండలం  అందనాలపాడులో  మైక్  సెట్  చేస్తున్న  సమయంలో  విద్యుత్  షాక్  తో ఇద్దరు మృతి  చెందారు. ఈ ఘటన ఈ  ఏడాది జూన్  21న  జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios