Asianet News TeluguAsianet News Telugu

'రాజకీయ సౌలభ్యం కోసం.. ఉగ్రవాదంపై ఉదాసీనత..' ఐరాస వేదికగా కెనడా, పాక్ ల దుమ్ముదులిపిన భారత్

Jaishankar: ఐక్యరాజ్య సమితి సాధారణ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌  ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని ప్రధాన అంశంగా చేసుకున్నారు. రాజకీయ సౌలభ్యత కోసం ఉగ్రవాదం, హింస మీద చర్యల విషయంలో ఉదారంగా ఉండొద్దని పరోక్షంగా కెనడా, పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ్య దేశాలన్నీ సమితి నియమ నిబంధనలను గౌరవించాలని.. ఒకరి వ్యవహారాల్లో మరొకరు తలదూర్చడం తగదని హితవుపలికారు.

S Jaishankar At UN Amid Canada Row KRJ
Author
First Published Sep 27, 2023, 6:01 AM IST

Jaishankar: కెనడాలో ఖలిస్థానీల చర్యలు.. చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సాహ చర్యలు.. వీటన్నింటిని దుష్ట్రిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌’ పేరిట ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన అదే పేరుతో ముగించడం గమానార్హం.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని ప్రధాన అంశంగా చేసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం లేదా హింసపై ప్రతిచర్యలకు రాజకీయ సౌలభ్యత కోసం ఉదారంగా ఉండొద్దని పరోక్షంగా కెనడా, పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.సభ్య దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాలని , ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దేశాలకు పిలుపునిచ్చారు.  

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో శాశ్వత సభ్యదేశంగా భారత్‌ను చేర్చడాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ కోరారు.  జైశంకర్ భారతదేశం G20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్లోబల్ సౌత్ వాయిస్‌ని పెంచడం, సమూహంలో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చడం గురించి ఎత్తి చూపారు. "చాలా పాత సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి ఈ ముఖ్యమైన సంస్కరణల నుండి ప్రేరణ పొందాలి." భద్రతా మండలి సంస్కరణకు సమితికి ఇది ప్రేరణ కావాలని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. కాగా, అలీనోద్యమ కాలం నుంచి భారత్‌ బయపడిందని.. ఇప్పుడు విశ్వగురు (యావత్‌ ప్రపంచానికి గురువు)గా ఎదిగిందని చెప్పుకొచ్చారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ..  చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేయాలనేది మా తాజా వాదన అని అన్నారు. ప్రజాస్వామ్యం యొక్క ప్రాచీన సంప్రదాయాలు లోతైన ఆధునిక మూలాలను కలిగి ఉన్న సమాజం కోసం నేను మాట్లాడుతున్నాను. ఫలితంగా, మన ఆలోచనలు, వైఖరులు మరియు చర్యలు మరింత ప్రాతిపదికగా, ప్రామాణికమైనవని పేర్కొన్నారు.

75 దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. మేము విపత్తు మరియు అత్యవసర పరిస్థితుల్లో మొదటి ప్రతిస్పందనదారులుగా కూడా అయ్యాము. అతను టర్కీ మరియు సిరియాలో సంభవించిన భూకంపాలను ఉదాహరణగా ఇచ్చాడు.

భారత్-కెనడా వివాదం ఏమిటి?

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం ఆరోపించారు. జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. భారత్ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడు. ట్రూడో ఆరోపణల తర్వాత.., భారతదేశం తీవ్రంగా ప్రతిస్పందించింది మరియు అతని ఆరోపణలను అసంబద్ధం, నిరాధారమైన మరియు రాజకీయ ప్రేరేపితమని పేర్కొంది. ట్రూడో ప్రభుత్వం తన వాదనకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను ఇంకా పంచుకోలేదని భారతదేశం తెలిపింది. ఈ వివాదం కారణంగా.. భారతదేశం, కెనడా దౌత్య స్థాయిలో చర్యలు తీసుకున్నాయి మరియు సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios