Asianet News TeluguAsianet News Telugu

thanuja murder case : వీడ‌ని గుంటూరు టెకీ త‌నూజ డెత్ మిస్ట‌రీ..

గుంటూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ డెత్ లో మిస్టరీ ఇంకా వీడటం లేదు. ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తనూజ.. రాత్రి విజయవాడ శిఖామణి సెంటర్ లో శవమై కనిపించింది. అయితే ఆమె మృతికి కారణం ఏంటనే విషయం ఇంకా తెలియడం లేదు. 

thanuja murder case: Guntur Tech Tanuja Death Mystery ..
Author
Vijayawada, First Published Jan 20, 2022, 11:33 AM IST

గుంటూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ (software enginee) త‌నూజ డెత్ మిస్ట‌రీ ఇంకా వీడ‌లేదు. మూడు రోజుల కింద‌ట విజయవాడ శిఖామణి సెంటర్‌లో (vijayawada shikhamani center) రోడ్డు పక్కన ఈమె మృత‌దేహం ల‌భించింది. తొలుత గుర్తు తెలియ‌ని మ‌హిళ మృతదేహంగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌రువాత ఆమె ఆదివారం నుంచి ఇంట్లో నుంచి క‌నిపించ‌కుండా పోయినా త‌నూజ (30)గా గుర్తించారు. 

ఈ కేసులు మృత‌దేహం ల‌భించి మూడు రోజులు అవుతున్నా.. ఈ మృతికి కార‌ణం ఏంట‌న్న విష‌యంలో ఇంకా ఎలాంటి డెవ‌ల‌ప్ మెంట్ క‌నిపించ‌డం లేదు. మృదేహం దొరికిన ప్ర‌దేశంలో సీసీ కెమెరాలు (cc camera) ఉన్న‌ప్ప‌టికీ అవి స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డ్ కాలేదు. ఇక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న సీసీ కెమెరాలు ప‌ని చేసి ఉంటే ఘ‌ట‌నా ప్ర‌దేశంలో ఏం జ‌రిగింద‌నే విష‌యం స్ప‌ష్టంగా రికార్డ్ అయ్యేది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లోనే ప‌లువురు వీఐపీలు నివ‌సిస్తున్నారు. వారి ఇంటి స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా ప‌ని చేయ‌క‌పోవ‌డం విస్తుగొలుపుతోంది. 

ఆదివారం రాత్రి 12.30 నిమిషాల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ త‌నూజ మృతదేహాన్ని గుర్తించారు. అయితే ప‌ద‌కొండున్న‌ర వ‌ర‌కు ఆ విజయవాడ శిఖామణి సెంటర్ ప్ర‌దేశంలో స్థానికుల హ‌డావిడి ఉంటుంది. ఆ స‌మ‌యం అక్క‌డ మ‌నుషుల క‌ద‌లిక‌లు ఉంటాయి. కానీ వారు ఉన్న స‌మ‌యంలో అక్క‌డ మృత‌దేహం క‌నిపించ‌లేదు. కానిస్టేబుల్ వ‌చ్చిన స‌మ‌యంలో మాత్ర‌మే క‌నిపించింది. అంటే దాదాపు న‌ల‌బై నుంచి యామై నిమిషాల్లో అక్క‌డ ఏం జ‌రిగిందో అన్న విష‌యం తెలియ‌డం లేదు. ఆ ప్రాంతంలో ఎలాంటి యాక్సిడెంట్ జ‌ర‌గలేద‌ని స్థానికులు చెప్పారు. త‌నూజ డెడ్ బాడీపై కూడా ఎలాంటి గాయాలు ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయి.. ఎప్పుడు మ‌నుషుల క‌ద‌లిక‌లు ఆగిపోతాయో పూర్తిగా తెలిసిన వారే త‌నూజ డెడ్ బాడీని ఇక్క‌డ ప‌డేసి ఉంటార‌ని పోలీసుల భావించి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ‌తంలో ఇలాగే మృతి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కేసును తొంద‌ర‌గా ఛేదించిన పోలీసులకు.. ఈ కేసు ఛాలెంజింగ్ మారింది. 

అసలేం జ‌రిగిందంటే.. 
గుంటూరుకు చెందిన ఓ టెకీ తనూజ‌కు మ‌రో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అయిన మ‌ణికంఠను (manikanta) 2018 పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆదివారం ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన యువతి మరుసటి రోజు వరకు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె విజ‌య‌వాడ శిఖామణి సెంటర్‌లో ఆదివారం రాత్రి శ‌వ‌మై క‌నిపించింది. దీంతో అక్క‌డి పోలీసులు గుర్తు తెలియ‌ని మృతదేహంగా కేసు న‌మోదు చేసి.. ఆమె ఫొటోను అన్ని పోలీసు స్టేష‌న్ల‌కు పంపించారు. ఆ ఫొటో త‌నూజ‌ను పోలి ఉండ‌టంతో అక్క‌డి వెళ్లి నిర్ధారించుకున్నారు. అయితే త‌నూజ మృతదేహంపై ఎలాంటి గాయాలు క‌నిపించ‌లేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios