ఉద్యమ సమయంలో కాపులపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యమ సమయంలో కాపులపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (ap cm jaganmohan reddy) తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (agriculture minister kurasala kannababu) అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాపుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ (tdp) హయాంలో కాపులని అసాంఘిక శక్తులుగా చిత్రీకరించారని విమర్శించారు.
మహిళల పైనా కూడా తప్పుడు కేసులు పెట్టారని మంత్రి ఆరోపించారు. కాపు నాయకుడు ముద్రగడ (mudragada) కుటుంబాన్నివేధింపులకు గురి చేశారని అన్నారు. కాకినాడ సెజ్ (SEZ) రైతులపై టీడీపీ ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తించారని తెలిపారు. వారిని హింసించి జైలులో వేశారని అన్నారు. రైతులతో బాత్రూమ్ లు కడిగించారని అన్నారు. కాకినాడ SEZ రైతులపై ఉన్న కేసులను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే జీవో విడుదల చేస్తుందని ఆరోపించారు.
కాకినాడ రూరల్ (kakinada rural) నియోజకవర్గంలో చాలా పురాతనమైన దేవాలయాలు శిధిలావస్థలో ఉన్నాయని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని మతాలకు సంబంధించిన ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
టీటీడీ సహకారంతో బీసీ, ఎస్సీ పేటలలో రామాలయాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి (ttd chairman subbareddy) అంగీకారం తెలిపారని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని కొంత మంది కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అన్నీ ఆర్ బీకే (RBK) సెంటర్లలో ఎరువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ఎరువులను కేంద్ర ప్రభుత్వం అటు వైపు మళ్లించిందని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎరువులు సకాలంలో అందటం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం తూర్పు గోదావరి (East godavari) జిల్లాకు 15000 వేల టన్నుల ఎరువులు కేటాయింపు జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాకు 10500 టన్నులే అవసరమని అన్నారు. అయినప్పటికీ అధనంగా ఎరువులు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే 5000 టన్నుల ఎరువులు నౌకల్లో విశాఖపట్నం, కాకినాడ ఓడరేవులకు చేరుకున్నాయని మంత్రి స్పష్టం చేవారు. మిగిలిన ఎరువులు 6,10వ తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాకు చేరకుంటాయని ఆయన పేర్కొన్నారు.
