Asianet News TeluguAsianet News Telugu

వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు: ఈసీ రమేష్ పై తమ్మినేని వ్యాఖ్యలు

ఏపీ స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కమ్మ వైరసా, కరోనా వైరసా అని ఆయన వ్యాఖ్యానించారు.

Thammmineni Seetharam makes serious comments against Ramesh Kumar
Author
Srikakulam, First Published Mar 16, 2020, 3:37 PM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈసీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఇక ఎందుకుందని ఆయన అడిగారు. రమేష్ కుమార్ ను సీఎం కుర్చీలో కూర్చోమని చెప్పండని ఆయన అన్నారు. ఏం  తమాషా చేస్తున్నారా అని ఆయన అన్నారు. 

రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కులమతాలకు అతీతంగా ఉండాలని ఆయన అన్నారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని స్పీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నోటిఫికేషన్ ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదని ఆయన చెప్పారు. 

Also Read: జగన్ కే నా సపోర్ట్... ఈసీ చేస్తున్నదే కరెక్ట్ కాదు: జెసి సంచలనం

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనమేమిటని ఆయన ఆగ్రహించారు. రాష్ట్రానికి కరోనా వైరసా, కమ్మ వేరసా అని ఆయన వ్యాఖ్యానించారు. రమేష్ కుమార్ ఏది చేస్తే అది చెల్లుతుందని అనుకుంటున్నారా అని ఆయన అడిగారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని ఆయన అన్నారు. 

2019లో ఎన్నికల కమిషన్ సీఎస్ ను మారిస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టారని ఆయన అన్నారు. కలెక్టర్లను మార్చాలని చెప్పే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని అడిగారు. రమేష్ కుమార్ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానమని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆయన అన్నారు.

Also Read: ఈసీ రమేష్ కుమార్ చంద్రబాబు స్లీపర్ సెల్: విజయసాయి రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios