Asianet News TeluguAsianet News Telugu

జగన్ కే నా సపోర్ట్... ఈసీ చేస్తున్నదే కరెక్ట్ కాదు: జెసి సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికలను ఎన్నికల కమీషన్ వాయిదా వేయడం వివాదాస్పదంగా మారుతున్న సమయంలో టిడిపి నాయకులు, మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాక్యలు చేశారు. 

JC Diwakar Reddy Sensational Comments on Local Body Elections Postponed in AP
Author
Amaravathi, First Published Mar 16, 2020, 2:52 PM IST

విజయవాడ: స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై మాజీ ఎంపి, టిడిపి నాయకులు జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివాకర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను రమేష్ కుమార్ ను కలిశారు. ఈసీతో కాస్సేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

అనంతరం దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చాలా రోజులు వాయిదాపడటం కరెక్ట్ కాదన్నారు. తక్కువ‌ రోజుల్లో ఎన్నికలు ప్రక్రియ ముగియాలన్న సిఎం జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఇలా తక్కువ రోజుల్లొ ఎన్నికలు ముగియడం వల్ల ఖర్చు ఆదా అవుతుందని...అది అందరికి మంచిదేనన్నారు. కాబట్టే  సిఎం జగన్ నిర్ణయాన్నిసమర్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.

read more  పోవయ్యా, బుద్ధిలేని మాటలు: జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయితే ఎన్నికలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఈసీదేనన్నారు. ఈ ఎన్నికల వాయిదాపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు. నామినేషన్లకు ముందు, తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. కష్టపడి నామినేషన్లు వేశామని... ఎన్నికల గడువు పెరిగితే  పోలిసులు, వైసిపి వాళ్ళు ఉండనిస్తారా అని ప్రశ్నించారు. 

ప్రభుత్వ అధినేత జగన్, ఉన్నతాధికారులకు పొలీసులు భయపడుతున్నారని జెసి అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి పోలింగ్ బూత్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తేనే దౌర్జన్యకాండను ఆపవచ్చని ఈసీని కోరినట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వద్ద డబ్బు లేకపోతే అందుకయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని చెప్పామన్నారు. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

read more  ఈసీ రమేష్ కుమార్ చంద్రబాబు స్లీపర్ సెల్: విజయసాయి రెడ్డి

పోలింగ్ రోజు బూతుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారో లేదో క్లారిటీ లేదన్నారు. ఇక ఎన్నికల విషయంలో హైకోర్టు జొక్యం చేసుకునే అవకాశాలు లేవన్నారు. ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదన్నారు జెసి దివాకర్ రెడ్డి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios