గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.  జగన్ నివాసానికి ఎదురుగా గల అమర్ రెడ్డి కాలనీ వాసులే ఆందోళనకు దిగారు. ఈ కాలనీలో నివాసముంటున్న ప్రతిఒక్కరూ స్థానిక సచివాలయంలో ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలని  మున్సిపల్ అధికారులు సూచించారు. ఇదే స్థానికుల ఆందోళనకు కారణమయ్యాయి. 

30 సంవత్సరాలుగా దాదాపు 300వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని... తమను ఖాళీ చేయించేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించిన తమకు అధికారులు సమాధానం ఇవ్వకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. తమ ఇళ్ళ కూల్చివేతకు కుట్ర జరుగుతోందని వార్డ్ సచివాలయాన్ని కూడా స్థానికులు ముట్టడించారు. 

 ఇదిలావుంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి  మున్సిపాలిటిలను కార్పొరేషన్ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండింటినీ క‌లిపి మంగ‌ళ‌గిరి- తాడేప‌ల్లి న‌గ‌ర‌పాలిక‌గా మారుస్తూ సర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి  మున్సిపాలిటిలను కార్పొరేషన్ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండింటినీ క‌లిపి మంగ‌ళ‌గిరి- తాడేప‌ల్లి న‌గ‌ర‌పాలిక‌గా మారుస్తూ సర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ కార్పోరేషన్ పరిధిలోకి మంగ‌ళ‌గిరిలోని 11, తాడేప‌ల్లిలోని 10 పంచాయ‌తీలు విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ఈ గ్రామ పంచాయతీల విలీనాలను నిరసిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.