కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కుప్పం నుండి  లోకేష్ పోటీ చేయాలని  టీడీపీ నేత టీజీ భరత్ కోరారు. ఇవాళ కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటనకు  టీజీ భరత్ కౌంటరిచ్చారు.


కర్నూల్: కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కుప్పం నుండి లోకేష్ పోటీ చేయాలని టీడీపీ నేత టీజీ భరత్ కోరారు. ఇవాళ కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటనకు టీజీ భరత్ కౌంటరిచ్చారు.

ఆదివారం నాడు టీజీ భరత్‌ ఎస్వీ మోహన్ రెడ్డికి కౌంటరిచ్చారు. చంద్రబాబును కర్నూల్ నుండి పోటీ చేయాలని తాను గత ఏడాదే కోరినట్టు టీజీ భరత్ గుర్తు చేశారు. బాబు వల్లే అమరావతి అభివృద్ధి చెందిందన్నారు.

కర్నూల్ నుండి చంద్రబాబునాయుడు పోటీ చేస్తే జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపిస్తామన్నారు. కర్నూల్‌లో బాబును 75వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామన్నారు. కర్నూల్‌లో చంద్రబాబునాయుడు పోటీ చేయకపోతే గెలిచేవారికే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

టీడీపీలో కర్నూల్ 'చిచ్చు': ఎస్వీ మోహన్ రెడ్డి సంచలనం