టీడీపీలో కర్నూల్ 'చిచ్చు': ఎస్వీ మోహన్ రెడ్డి సంచలనం

First Published 17, Feb 2019, 12:50 PM

: కర్నూల్ అసెంబ్లీ సీటు టీడీపీ నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.  ఈ సీటు విషయమై ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు భరత్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఈ సీటు కోసం ఈ ఇధ్దరు కూడ తమ వంతుప్రయత్నాలను ప్రారంభించారు. పోటా పోటీగా సర్వేలను కూడ ప్రారంభించారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తును నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీల పనితీరు ఆధారంగా ఈ దఫా టిక్కెట్లను కేటాయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జాబితా తయారీ కోసం బాబు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ఉన్న టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరిద్దరూ కూడ మంత్రులుగా ఉన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా వీరిద్దరూ కూడ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.

అయితే వైసీపీ నుండి కర్నూల్ నుండి విజయం సాధించిన ఎస్వీ మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఈ సీటు కోసం టీజీ భరత్‌ కూడ పోటీ పడుతున్నారు.

ఆదివారం నాడు ఎస్వీ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు. కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి లోకేష్ పోటీ చేయాలని కోరారు. లోకేష్ కోసం తాను తన సీటును త్యాగం చేస్తానని ప్రకటించారు. కర్నూల్ మినహా వేరే అసెంబ్లీ సీటును తాను కోరుకోనని ఆయన చెప్పారు. తనకు తప్ప వేరే వ్యక్తికి ఈ సీటును ఇస్తే మాత్రం ఊరుకోబోనని ఎస్వీ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.

అయితే ఈ విషయమై చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. గత ఏడాదిలో కర్నూల్ పర్యటన సమయంలో కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.