Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. ఏపీ గిరిజన రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఎలుకల దాడి.. పలువురు విద్యార్థులకు గాయాలు

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఎలుకల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బాధితులు చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. 

Terrible.. Rat attack in AP tribal residential hostel.. Many students injured
Author
First Published Nov 30, 2022, 12:17 PM IST

అనంతపురం జిల్లాలోని గూడి మండలంలో ఉన్న సేవాఘడ్‌లోని గిరిజన సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ లో విద్యార్థులపై ఎలుకల దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. బాధిత విద్యార్థులకు సాయం అందించడంలో  హాస్టల్ సిబ్బంది విఫలమయ్యారు.

కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య..శవాన్ని ముక్కలుగా నరికి, వీధుల్లో పారేస్తూ కెమెరాకు చిక్కిన తల్లీకొడుకులు

రాష్ట్రంలోని ఆదివాసీల పవిత్ర స్థలమైన చారిత్రక సేవాగఢ్‌కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చెర్లోపల్లి సమీపంలో హాస్టల్ ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలలో 9, 10 తరగతులకు చెందిన 35 మంది విద్యార్థులకు హాస్టల్‌లోని మూడో అంతస్తులో గదులు ఉన్నాయి. సోమవారం రాత్రి యథావిధిగా విద్యార్థులు నిద్రకు ఉపక్రమించారు. అయితే ఇదే సమయంలో ఎలుకల గుంపు వచ్చి విద్యార్థుల శరీరాన్ని కరిచాయి. అయితే  కొంతమంది విద్యార్థులు బయటి నుంచి ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ తెచ్చి హాల్లో ఉంచారని, అందుకే ఎలుకలు వచ్చాయని ‘డెక్కన్ క్రానికల్’కథనం పేర్కొంది. 

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. ఆయన కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన దర్యాప్తు సంస్థ..

‘‘గుడ్డులో వేయించిన అన్నం వాసన వల్ల ఎలుకల గుంపు డ్రైనేజీ పైపుల ద్వారా హాల్‌లోకి ప్రవేశించాయి. ఆహారం కోసం వెతుకుతూ విద్యార్థులను కరిచాయి. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు ’’ అని హాస్టల్ సిబ్బంది పేర్కొన్నారు. ఇక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేకపోవడంతో గాయపడిన విద్యార్థులకు సిబ్బంది సహాయం అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులే సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని చికిత్స కోసం గూటి ఆసుపత్రిని ఆశ్రయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios