కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్త పాకాలలో దివీస్ ల్యాబేరేటరీని ఏర్పాటు చేయవద్దని  కోరుతూ ఆందోళన కొనసాగించారు. తాత్కాలిక నిర్మాణాలకు స్థానికులు నిప్పు పెట్టారు. వామపక్షపార్టీల నేతలను , స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

 

తొండంగి మండలం కొత్తపాకాలలో దివీస్ లాబోరేటరీ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు.ఇవాళ దివీస్ లాబ్ ప్రహారీగోడను కూల్చి వామపక్షపార్టీల కార్యకర్తలు, రైతులు ల్యాబ్ నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లారు. తాత్కాలిక నిర్మాణాలను నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు, రైతులను, స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని నిర్బించొద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో కాలుష్యంతో తమకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు.