ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి: జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

గుంటూరులో ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతితో జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఆదివారం నాడు ఉద్రిక్తత నెలకొంది.

Tension prevails at GGH in Guntur hospital lns

గుంటూరు: గుంటూరులో ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతితో జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఆదివారం నాడు ఉద్రిక్తత నెలకొంది.

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆశా వర్కర్  విజయలక్ష్మి మరణించారని ఆశా వర్కర్ల యూనియన్ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నేతలు కోరారు.

మరో వైపు విజయలక్ష్మి మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ ప్రకటించారు. అయితే ఈ వాదనతో విజయలక్ష్మి కుటుంబసభ్యులతో పాటు ఆశా వర్కర్ల యూనియన్ నేతలు ఏకీభవించడం లేదు.

వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాతే విజయలక్ష్మి అనారోగ్యానికి గురైందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది,. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.ఆశా వర్కర్స్ యూనియన్ నేతలపై జిల్లా కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ నెల 20వ తేదీన ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకొంది. ఈ వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత ఆమెకు వాంతులు, తలనొప్పి, ఫిట్స్ వంటి లక్షణాలు కన్పించినట్టుగా బాధితురాాలి కుటుంబసభ్యులు  చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆమె మరణించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios