విజయవాడ:  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి శుక్రవారంనాడు పోలీసులు వచ్చిన సమయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు.ఇదే విషయమై  మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు గాను పోలీసులు శుక్రవారం నాడు ఆయన నివాసానికి చేరుకొన్నారు. 

also read:మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసు: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసుల నోటీసులు

మంత్రి పేర్నినానిపై దాడికి సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు కోరారు.  ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తనను విచారించేందుకు రావడం సరైంది కాదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ విషయమై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

రవీంద్ర ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి నివాసానికి చేరుకొన్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు కొల్లు రవీంద్ర ఇంటికి చేరుకొని పోలీసులతో చర్చించారు.  పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి రవీంద్రను తీసుకెళ్లాలని చెప్పడం  సరైంది కాదని కొనకళ్ల నారాయణరావు  చెప్పారు.