విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా పోలీసులు గురువారం  నాడు నోటీసులు జారీ చేశారు. మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నవంబర్ 29వ తేదీన మంత్రి పేర్నినానిపై ఆయన ఇంట్లోనే నాగేశ్వరరావు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.పేర్నినాని ఆనుచరులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

also read:పేర్ని నానిపై దాడి: విచారణకు ఆదేశించిన హోంమంత్రి

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు సీఆర్‌సీపీ 91 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.మద్యం మత్తులో నాగేశ్వరరావు మంత్రిపై  దాడికి దిగారని గుర్తించారు. నాగేశ్వరరావును కూడ కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాగేశ్వరరావును కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు  కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇదే నియోజకవర్గంలో గతంలో మంత్రి పేర్నినాని అనుచరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ హత్యకు గురయ్యాడు. మార్కెట్ కమిటీ ఛైర్మెన్ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు జైల్లో ఉండి ఇటీవలనే కొల్లు రవీంద్ర విడుదలయ్యారు.