చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ


ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించాడు.ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకొంది.

Tension prevails at Chandrababunaidu residence in guntur


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై  పెడన ఎమ్మెల్యే జోగి రమేష్  మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సమయంలో చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

పాలన చేతకానివాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని జగన్ పై చంద్రబాబునాయుడు, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణలు చెప్పాలని  జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇవాళ చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు జోగి రమేష్ వచ్చారు. 

ఈ విషయం తెలుసుకొన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరికొందరు టీడీపీ కార్యకర్తలు  జోగి రమేష్  సహా వైసీపీ కార్యకర్తలను అడ్డుకొన్నారు.ఇరువర్గాలు పరస్పరం జెండా కర్రలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొన్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. కొట్టుకొన్నారు. బూతులు తిట్టుకొన్నారు.తన కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని జోగి రమేష్ ఆరోపించారు. తనపై దాడికి దిగారని ఆయన చెప్పారు. ఇంట్లో పిరికిపందలా చంద్రబాబునాయుడు దాక్కొన్నారని జోగి రమేష్ విమర్శించారు.ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. తమపై రాళ్లతో దాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు.  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడ్డారు. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యే జోగిరమేష్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios