కారణమిదీ:తెనాలి ఆసుపత్రి వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన, ఉద్రిక్తత

గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రి వద్ద గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.  తుమ్మపూడికి చెందిన  లక్ష్మీ తిరుపతమ్మ డెడ్ బాడీని లోకేష్ వచ్చే వరకు  తీసుకెళ్లొద్దని టీడీపీ క్యాడర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

Tension Prevails After TDP Cadre Protest  At Tenali Hospital In Guntur District

గుంటూరు: జిల్లాలోని Tenali  ఆసుపత్రి వద్ద గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. తెనాలి ఆసుపత్రి నుండి అత్యాచారం చేసి హత్యకు గురైన బాధితురాలి మృతదేహన్ని తరలించకూడదని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయమై పోలీసులతో TDP  శ్రేణులు వాగ్వాదం చోటు చేసుకంది.

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగింది. వీరంకి Laxmi Tirupathamma అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం నాడు రాత్రి మరణించింది. ఆమెపై Rape  చేసి Murder  చేసినట్టుగా అనుమానిస్తున్నారు. Dead Body సమీపంలోనే Liquor  బాటిల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. తిరుపతమ్మ  మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ఆసుపత్రికి తరలించారు. తెనాలి ఆసుపత్రి వద్ద  మహిళా కమిషన్ చైర్ పర్సన్  Vasireddy Padma పరామర్శించారు. మరో వైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  రానున్నారు.  తెనాలి ఆసుపత్రి నుండి తుమ్మపూడికి డెడ్ బాడీని తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  అయితే లోకేష్ వచ్చేవరకు డెడ్ బాడీని తుమ్మపూడికి తరలించవద్దని పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios