కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాల్లోకి కూడా వ్యాప్తి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎర్రగొండపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో హిజాబ్ వేసుకొన్న విద్యార్ధినులను అనుమతించకపోవడంతో వివాదం తలెత్తింది.
ఒంగోలు: Prakasam జిల్లా Yerragondapalemలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద హిజాబ్ వివాదం చోటు చేసుకొంది. స్కూల్ కు వచ్చిన ఓ వర్గం విద్యార్ధినులను Hijab తీసివేసి రావాలని యాజమాన్యం కోరింది. దీంతో ఆ వర్గానికి చెందిన వారంతా స్కూల్ వద్ద మంగళవారం నాడు ఆందోళనకు దిగారు.
Karnataka రాష్ట్రంలో ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాల్లోకి కూడా వ్యాప్తి చెందుతుంది. Andhra Pradesh రాష్ట్రంలో గతంలోనే ఈ తరహ ఘటన ఒకటి వెలుగు చూసింది. తాజాగా ఎర్రగొండపాలెంలోని ఓ Private School లో ఓ వర్గం విద్యార్ధినులను హిజాబ్ ధరించి వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం అనుమతించలేదు. దీంతో విద్యార్ధినులు తమ పేరేంట్స్ కు ఈ సమాచారం చేరవేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రులతో పాటు ఆ వర్గానికి చెందిన పెద్దలు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఐదు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని లయోలా కాలేజీలో కూడా ఇద్దరు విద్యార్ధినులు హిజాబ్ ధరించినందుకు గాను క్లాసులోకి అనుమతించలేదు. అయితే ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. కాలేజీకి యూనిఫామ్ లోనే రావాలని విద్యార్ధినులకు సూచించినట్టుగా చెప్పారు. క్లాస్ రూమ్ లోకి వచ్చే ముందే విద్యార్ధినులు మహిళల వెయిటింగ్ రూమ్ లోనే హిజాబ్ ను తీసి వేసి వస్తారని ప్రిన్సిపాల్ గుర్తు చేశారు. కాలేజీ నియమ నిబంధనల మేరకు విద్యార్ధులంతా వ్యవహరించాల్సి ఉందని ప్రిన్సిపాల్ వివరించారు.
గతనెలలో Udupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభమైంది. ఆరుగురు విద్యార్థినిలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి హిజాబ్ లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్యతిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు ప్రవేశించారు. తాము కండువా ధరించి వస్తామని తెలిపారు. కానీ వ్యతిరేకించడంతో తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు మరో వర్గం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.
ఈ క్రమంలో ఫిబ్రవరి 8 ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ High Courtలో పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించింది..స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదంతో పాటు శివమొగ్గంలో భజరంగ్ ధళ్ సభ్యుడు హర్ష హత్యకు గురికావడంతో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు బెంగుళూరులో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఫిబ్రవరి 21వ తేదీన జారీ చేసిన అధికారపత్రంలో పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నందున ఏ క్షణంలోనైనా మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా బెంగళూరులో స్కూల్స్, పీయూ కాలేజీలు, డిగ్రీ కాలేజీల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
