నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో అర్ధంకాక జనాల్లో ఆందోళన పెరిగిపోతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్ల ఇళ్ళపై పోలీసులు అర్ధరాత్రుళ్ళు దాడులు చేయటమేంటో ఎవరికీ అర్దం కావటంలేదు. వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల ఇళ్లపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండానే దాడులు జరపటం టిడిపిలోని భయాన్ని స్పష్టం చేస్తోంది. నంద్యాల మున్సిపల్టీలో 12వ వార్డులో హనీఫ్ భాషా టిడిపి కౌన్సిలర్ కిడ్నాప్ ఉదంతమే తాజా ఉదాహరణ.

నంద్యాలలో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవైపు ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఇంకోవైపు వైసీపీ నేతల ఇళ్ళపై పోలీసుల దాడులు. చివరకు కిడ్నాపులు కూడా మొదలయ్యాయి. దాంతో నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో అర్ధంకాక జనాల్లో ఆందోళన పెరిగిపోతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్ల ఇళ్ళపై పోలీసులు అర్ధరాత్రుళ్ళు దాడులు చేయటమేంటో ఎవరికీ అర్దం కావటంలేదు. దాడులు చేయటానికి ప్రతిపక్ష నేతలైతే చాలన్నట్లు పోలీసుల తీరు.

అందుకు శనివారం జరిగిన ఘటనే ఉదాహరణ. వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల ఇళ్లపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండానే దాడులు జరపటం టిడిపిలోని భయాన్ని స్పష్టం చేస్తోంది. నంద్యాలలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేతలను భయానికి గురిచేసి దారికి తెచ్చుకోవాలన్నది టిడిపి నేతల ఆలోచనగా స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్నారు. డెవలప్మెంట్ పేరుతో వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్, మంత్రులు, ఎంఎల్ఏలు అక్కడే తిష్టవేసారు. అయినా టిడిపిలో ఓటమి భయం వెన్నాడుతున్నట్లే ఉంది. అందుకే ప్రలోబాలకు, కిడ్నాపులకు కూడా దిగింది.

నంద్యాల మున్సిపల్టీలో 12వ వార్డులో హనీఫ్ భాషా టిడిపి కౌన్సిలర్ కిడ్నాప్ ఉదంతమే తాజా ఉదాహరణ. ఆదివారం మధ్యహ్నం తన మద్దతుదారులతో కలిసి భాషా వైసీపీలో చేరారు. తర్వాత ఇంటికి వెళ్లి భోజనం చేసి పనిమీద తిరిగి బయటకు వెళ్ళారు. అప్పటి నుండి కుటుంబసభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రిప్లై వస్తుండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి వైసీపీ నేతలతో చెప్పారు. ఆనోటా ఈనోటా విషయం బయటకు పొక్కటంతో సామాజికవర్గంలోని పలువురు భాషా ఇంటికి చేరుకున్నారు.

భాషాను గుర్తుతెలీని వ్యక్తులెవరో కిడ్నాప్ చేసారంటూ ఆందోళన మొదలుపెట్టారు. ఇంటిముందు రోడ్డుపైనే బెఠాయించారు. దాంతో భాషా వ్యవహారం పెద్ద కలకలం రేపింది. అయితే, రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాషా టిడిపి నేత ఎన్ఎండి ఫరూక్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఫరూక్ కార్యాలయంలో ప్రత్యక్షమైన భాషా తనంతట తానే మధ్యాహ్నం వైసీపీలో చేరినట్లు చెప్పారు. కానీ రాత్రికి తిరిగి టిడిపిలో చేరినట్లు కూడా ఆయనే చెప్పారు. అంటే మధ్యలో ఏం జరిగిందన్నది మిస్టరీ. భాషాను టిడిపి వాళ్ళే కిడ్నాప్ చేసి ఒత్తిడికి గురిచేయటంతో తిరిగి భాషా టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ ముగిసేలోగా ఇటువంటివి ఇంకెన్ని చూడాలో ఏమో.