Asianet News TeluguAsianet News Telugu

ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఉద్రిక్తత: టీడీపి ఎమ్మెల్సీ ధర్నా

సామగ్రిని తొలగిస్తున్న సమయంలో టీజీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ధర్నాకు దిగడంతో ఉండవల్లి ప్రజావేదిక వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం కూడా తమకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

Tension prevailed at Undavalli Praja Vedika
Author
Undavalli, First Published Jun 22, 2019, 2:35 PM IST

అమరావతి: ఉండవల్లి ప్రజా వేదికలోని తెలుగుదేశం పార్టీ సామగ్రిని తొలగించడంపై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ప్రజా వేదికను తమకు అప్పగించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విజ్ఢప్తిని బేఖాతరు చేస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంతో అందులోని సామగ్రిని రెవెన్యూ అధికారులు తొలగించారు. 

సామగ్రిని తొలగిస్తున్న సమయంలో టీజీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ధర్నాకు దిగడంతో ఉండవల్లి ప్రజావేదిక వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం కూడా తమకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

ప్రజా వేదికలో చంద్రబాబు వ్యక్తిగత ఛేంబర్ కూడా ఉందని, ప్రజా వేదికను చంద్రబాబు లేని సమయంలో స్వాధీనం చేసుకోవడానికి పూనుకున్నారని, ఇది తప్పకుండా దుర్మార్గపు చర్యేనని ఆయన అన్నారు. కావాలనే తమను ప్రభుత్వం రెచ్చగెడుతోందని ఆయన అన్నారు. 

అయితే, చంద్రబాబు సామాన్లను తాము బయట పడేయలేదని ఆర్డీవో వీరబ్రహ్మం చెప్పారు. టీడీపీ సామాన్లు ఏవీ ప్రజా వేదికలో లేవని ఆన చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios