తెలుగుదేశంపార్టీ నేతల్లో ఆందోళన స్పష్టగా తెలుస్తోంది. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయెజనాలపై మొండి చెయ్యి చూపిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే బిజేపి మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్నీ రాజకీయ పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. అందలో భాగంగానే టిడిపికి సంబంధించి చంద్రబాబునాయుడు తప్ప మిగిలిన నేతలందరూ బాహంటాగానే కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

శుక్రవారం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. భాజపాతో పొత్తుల విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనంటూ జిల్లాల నేతలు చంద్రబాబుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక ఎంపిలు, మంత్రులు కూడా కాస్త అటు ఇటుగా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

చంద్రబాబు కూడా అందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే సంయమనం పటించాలంటూ చెప్పటం గమనార్హం. పైగా పాలన బాగాలేకపోతే రాజస్ధాన్లో వచ్చిన ఫలితాలే ఇక్కడ కూడా వస్తాయని చెప్పటంతో అందరూ విస్తుపోయారు. ఎందుకంటే, రాజస్ధాన్ లో జరిగిన రెండు ఎంపి, ఒక ఎంఎల్ఏ స్ధానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.

అక్కడ బిజేపినే అధికారంలో ఉన్నా కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే, పోలిక వరకూ బాగానే ఉన్నా ఏపిలో అధికారంలో ఉన్నది టిడిపి-భాజపాలే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజు వరకూ వేచి చూద్దామని చంద్రబాబు చెప్పటం కూడా చాలా మంది నేతలకు రుచించలేదు.