చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. మంగళవారం ఢిల్లీలో రేవంత్ కేంద్రంగా మొదలైన పరిణామాలు చంద్రబాబులో కలవరాన్ని పెంచేస్తున్నాయ్. ఎప్పుడైతే రేవంత్ టిడిపిని వదిలేస్తారని ప్రచారం మొదలవ్వగానే అందరికీ ‘ఓటుకునోటు’ కేసే గుర్తుకువస్తోంది. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని జరుగుతున్న ప్రచారమే చంద్రబాబులో కలవరానికి కారణమైంది.
చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. మంగళవారం ఢిల్లీలో రేవంత్ కేంద్రంగా మొదలైన పరిణామాలు చంద్రబాబులో కలవరాన్ని పెంచేస్తున్నాయ్. ఎప్పుడైతే రేవంత్ టిడిపిని వదిలేస్తారని ప్రచారం మొదలవ్వగానే అందరికీ ‘ఓటుకునోటు’ కేసే గుర్తుకువస్తోంది. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని జరుగుతున్న ప్రచారమే చంద్రబాబులో కలవరానికి కారణమైంది. రేవంత్ నిజంగానే టిడిపిని వదిలి కాంగ్రెస్ లో చేరితే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తేంటి? అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

ఎందుకంటే, రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన ‘ఓటుకునోటు’ కేసులో రేవంత్ రెడ్డి ఏ 1 నిందుతుడు. వేం నరేందర్ రెడ్డిని ఎంఎల్సీగా గెలిపించేందుకు చంద్రబాబు ఆడించిన నాటకంలో తెరపైన పాత్రదారి రేవంతే అయినప్పటికీ తెరవెనుక సూత్రదారి ఎవ్వరన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు పాత్రపై ఆడియో టేపుల సాక్ష్యాలు బయటపడ్డ సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కోర్టులో కేసు విచారణ జరిగితే తాను ఎక్కడ ఇరుక్కుంటానో అన్న భయంతోనే విచారణ జరగకుండా చంద్రబాబు పదే పదే అడ్డంపడుతున్నారు.
ప్రస్తుతానికి చంద్రబాబు సేఫ్ గానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఓటుకునోటు కేసులో గనుక రేవంత్ నోరిప్పితే చంద్రబాబు పరిస్ధితి..అంతే సంగతులు. ఇప్పటి వరకూ చంద్రబాబు నేతృత్వంలో రేవంత్ పనిచేస్తున్నారు కాబట్టి కేసు గురించి రేవంత్ ఎక్కడా నోరు విప్పలేదు. అదే కాంగ్రెస్ లో చేరితే అప్పటి రాజకీయ అవసరాలు, సమీకరణలు మారిపోతాయి.

ఎందుకంటే, టిడిపి-కాంగ్రెస్ మధ్యున్న రాజకీయ వైరం సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నేతగా అప్పుడు రేవంత్ టిడిపి పైన కూడా మాటల యుద్ధం చేయకతప్పదు. అందులో భాగంగానే ఓటుకునోటు కేసు గురించి గనుక రేవంత్ ప్రస్తావిస్తే చంద్రబాబు సీన్ మారిపోతుంది. అందులోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో.

రేవంత్ మనస్పూర్తిగా టిడిపిలోనే ఉండాలని అనుకున్నా, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తెలంగాణాలో టిడిపిని కెసిఆర్ కు తాకట్టు పెట్టేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అందులో భాగమే వచ్చే ఎన్నికలకు టిఆర్ఎస్-టిడిపి పొత్తులపై చర్చ జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు-కెసిఆర్ మధ్య ఏదో ఒప్పందం కూడా జరిగినట్లు అనుమానంగానే ఉంది.

ఆ అంశమే రేవంత్ లో ఆందోళన రేపుతోంది. అంటే, చంద్రబాబు తన భవిష్యత్తు కోసం ఎవరినైనా పణంగా పెట్టటానికి వెనకాడరని రేవంత్ కు అర్ధమైపోయిందట. చంద్రబాబు కోసమే ఇంతకాలం రేవంత్ కేసిఆర్ పై ఒంటికాలి మీద లేస్తున్నారు. అటువంటిది చంద్రబాబే చివరకు కెసిఆర్ కు సరెండర్ అయిపోతే తన గతేంకాను? అన్న విషయంలోనే రేవంత్ కు బాగా మండిందట. దాని ఫలితమే ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు.
