వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎస్సీ బాలిక మీద పదిమంది పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.
కడప : ముఖ్యమంత్రి Jagan సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. YSR District ప్రొద్దుటూరులో SC బాలికపై గత కొంత కాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే Molestationకి పాల్పడడంతో ఆమె గర్భందాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ minor girl ఆశ్రయం పొందుతున్న భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఆమె తల్లి చాలా ఏళ్ళ కిందటే చనిపోయింది. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ.. ఓ డెకరేషన్ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలిసింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలు సేకరించారు. తనపై చెంబు అతని స్నేహితులు ఆఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. ఇష్టం వచ్చిన చోట చెప్పుకో మని వారు సమాధానం ఇచ్చారని పేర్కొంది.
ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్ మల్లీశ్వరి వీడియో తీశారు. ఆ తరువాత పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సీఐ ఈ విషయం బయటకు పొక్కకుండా.. ఆ బాధితురాలిని గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే అమృత్ నగర్ లోని ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేయకుండా.. ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతోంది.
అయితే బాలికపై అత్యాచార ఘటన తమ దృష్టికి వచ్చిందని.. విచారణకు ఆదేశించామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించం అని, త్వరలోనే కేసు ఓ కొలిక్కి వస్తుందని ప్రొద్దుటూరు డిఎస్పి ప్రసాదరావు తెలిపారు.
కాగా, మంగళవారం నాడు చౌటుప్పల్ లో ఈ ఘటన కలకలం రేపింది. పగటివేళ భర్త పనికి వెళ్లగా చూసిన ఓ దుండగుడు అతడి భార్యపై దారుణంగా molestationకి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత ఆమె అపస్మారక స్థితిలో అచేతనంగా పడి ఉంటే మరోసారి rape చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకునే పారిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా Choutuppalమండలం తూప్రాన్ పేటలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాత్రి సమయానికి పోలీసుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటలలోపే నిందితుడిని వెతికి పట్టుకున్నారు.
ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తలపై కర్రతో బాది అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెబుతానని అన్నందుకు ఆమెను హతమార్చాడు. ప్రాణాలు కోల్పోయాక కూడా మరోసారి అత్యాచారం చేశాడు. భువనగిరి జిల్లా తూప్రాన్ పేటలో జరిగిన ఈ హత్యాచారం వివరాలను చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు.
