పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ ఈవో వేమూరి గోపి, అర్చకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని అర్చకుల ఆరోపిస్తున్నారు. 

పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ ఈవో వేమూరి గోపి, అర్చకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని అర్చకుల ఆరోపిస్తున్నారు. ఈవో గోపి వ్యవహారశైలి సరిగాలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ నుంచి ఆర్జిత సేవలు నిలిపివేస్తామంటూ అర్చకుల నోటీసు జారీ చేశారు. ఈవో గోపి దుర్భాషలాడుతున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. 

అయితే ఈవో గోపి ఇటీవల కొందరు అర్చకులు, సిబ్బంది ని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ వివాదం నేపథ్యంలో సమస్యను చక్కదిద్దేందుకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కోటప్పకొండకు వచ్చిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ రెడ్డి అక్కడి పరిస్థితులపై చర్చించారు. మరోవైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా అర్చకులతో చర్చలు జరుపుతున్నారు.