తెలుగు కథాశిల్పి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కన్నుమూత

తెలుగు కథాశిల్పి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కన్నుమూత

విజయవాడ: ప్రముఖ తెలుగు కథా రచయిత కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. సుబ్బరామయ్య 1938లో గుంటూరులో జన్మించారు. ఆయన తండ్రి రైల్వే స్టేషన్ మాస్టర్. 

ఒంగోలులో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన ఆ తర్వాత విజయవాడలోని కాలేజీలో చేరారు.  వేయిపడగలు రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వద్ద చదివారు. 

పెద్దభొట్ల సుబ్బరామయ్య ఆంధ్ర లయోలా కాలేజీలో లెక్చరర్ గా 40 ఏళ్ల పాటు పనిచేశారు 1996లో పదవీ విరమణ చేశారు. ఆయన 1959లో ఆయన కథా రచన ప్రారంభించారు మధ్యతరగిత సమస్యలు, వారిలో ఈర్ష్యాద్వేషాలు ఆయన కథావస్తువులు.

పెద్దిభొట్ల 200కు పైగా కథలు రాశారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు  మొదటి సంపుటికి 2012లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తొలి నవల ధృవతారలున ఆంధ్రపత్రిక వారపత్రికలో అచ్చయింది. 

ఆ తర్వాత ఆయన కథలు, రెండు నవలలున రాశారు. ఆయనకు రవిశాస్త్రి స్మారక సాహిత్య నిథి అవార్డు, గోపీచంద్‌ మెమోరియల్‌, అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్‌ అవార్డులు వచ్చాయి. 

పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఎన్నారై ఆస్పత్రి వర్గాలు పెద్దిభొట్ల పార్థివదేహాన్ని స్వాధీనం చేసుకోనున్నాయి. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page