కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు రాజా.. కీలక వ్యాఖ్యలు..
సినీ నటుడు, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

సినీ నటుడు, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజా.. తాను కాంగ్రెస్ పార్టీ అభిమానని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ స్పూర్తిగా, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. అయితే గతంలో సినిమాలతో, ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నానని చెప్పారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టుగా తెలిపారు. మణిపూర్ అల్లర్ల విషయంలో కొందరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కనీసం నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని రాజా విమర్శించారు. అటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చింది రాహుల్ గాంధీనే అని అన్నారు.
ఇక, ఆనంద్, వెన్నెల, స్టైల్, ఆ నలుగురు, మాయాబజార్, ఒక ఊరిలో వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం క్రైస్తవ మతప్రబోధకుడిగా పనిచేస్తున్నారు. అయితే రాజా వైఎస్సార్‌సీపీలో చేరకపోయినప్పటికీ.. గతంలో ఎన్నికల సమయంలో జగన్ తరఫున ప్రచారం చేశారు.