నంద్యాల్లో ప్రలోబాలకు టీడీపీ పాలుపడుతుంది. డబ్బును పంచుతున్నారని ఆరోపించిన వాసీ రెడ్డి పద్మా. విజయం వైసీపిదే అని ధీమా వ్యక్తం చేశారు
టీడీపీ నేతలు తమ మూడేళ్ల పాలనకు రిఫరెండంగా నంద్యాల ఎన్నికను స్వీకరించే దమ్ముందా.. అని ప్రశ్నించారు ఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. తెలుగు దేశం పార్టీ నాయకులు నంద్యాల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికార దాహాంతో ప్రజలను టీడీపీ డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
నంద్యాల్లో జరుగుతున్న ఎన్నికను టీడీపీ, వైసీపి మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు వాసి రెడ్డి పద్మ. టీడీపీ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె పెర్కొన్నారు. నంద్యాల్లో బాబుకు తప్పకుండా ప్రజలు బుద్ది చెబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాబు తన పాలనలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
