Asianet News TeluguAsianet News Telugu

అమ్మకు అన్యాయం చేయం, లోకేష్ కు తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా రాదు: లక్ష్మీపార్వతి

తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదంటూ సెటైర్లు వేశారు. పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారు. 

Telugu academy chairperson nandamuri lakshmi parvathi fires on chandrababu &nara lokesh
Author
Amaravathi, First Published Nov 22, 2019, 5:42 PM IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమి చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశంపై మాట్లాడే అర్హత తండ్రీ కొడుకులు ఇద్దరికీ లేదని హెచ్చరించారు. 

రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని నిలదీశారు. పాదయాత్ర సందర్భంగా పేదలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్నారని తెలుసుకున్న సీఎం జగన్ వారి కోసం, బడుగు బలహీన వర్గాలు కోసం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టారని తెలిపారు. 

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు భాష నష్టపోదని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ లో అంతా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ కోసం 6 వేల ప్రభుత్వ పాఠశాలను గతంలో చంద్రబాబు నాయుడు మూయించి వేశారని గుర్తు చేశారు. 

తెలుగు అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా: ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రైవేట్ స్కూల్స్ పేదల నుంచి లక్షల రూపాయల దోచే దోపిడీ నుంచి సీఎం జగన్ వారిని కాపాడుతున్నారని తెలిపారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూల్స్ చదివిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. 

తనకు, వెంకయ్య నాయుడుకు అవకాశము ఉంటే వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రం అంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తోందన్నారు. 

తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం ఎందుకు చంద్రబాబు కృషి చేయలేదో చెప్పాలని నిలదీశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. పొలిట్ బ్యూరోలో తీర్మానం చేసి రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

pawan kalyan:తల్లిని చంపొద్దు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

తెలుగు జాతి గౌరవాన్ని కాపాడింది దివంగత సీఎం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. అలాంటి ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంలో పట్టు లేక అనేకమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. 

ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను ఎందుకు రాష్ట్రానికి చంద్రబాబు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 

తెలుగుభాష గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరపలేని దుస్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు కూడా అర్పించలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారంటూ విమర్శించారు. 

తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదంటూ సెటైర్లు వేశారు. పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారు. 

ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

అమ్మ లాంటి  తెలుగు భాషకు తమ ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పుకొచ్చారు. ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా, ఈనాడు రామోజీరావు తన జర్నలిజం కాలేజీని తెలుగులో పెట్టారా అంటూ నిలదీశారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం వలనే ఉన్నత పదవులు సాధించారన్న విషయంలో వాస్తవం లేదా అని నిలదీశారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా అని లక్ష్మీపార్వతి నిలదీశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios