హైదరాబాద్:  ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ ఆశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఆశోక్‌ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ గ్రిడ్ సీఈఓ ఆశోక్‌కు తెలంగాణ పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడ అతను  ఇంతవరకు స్పందించలేదు.  దీంతో ఆశోక్‌ కోసం వేటను ముమ్మరం చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినందున ఇక ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు కేంద్రీకరించనున్నారు.

 మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ ప్రాథమిక విశ్లేషణలో.. పెద్దమొత్తంలో ఆధార్‌ సమాచారం ఉన్నట్లు తేలిందని, పూర్తిస్థాయి విశ్లేషణ చేపట్టాల్సి ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో పేర్కొంది.

ఐటీ గ్రిడ్స్‌ హార్డ్‌ డిస్క్‌లలో 7,82,21,397 రికార్డులు ఉన్నాయని తెలంగాణ పోలీసులు గుర్తించారు. అందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన డేటా ఉన్నట్లు సిట్‌ విచారణలో తేలింది. 

సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (సీఐడీఆర్‌), స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్స్‌ (ఎస్‌ఆర్‌డీఏఐ)లో మాత్రమే ఉండాల్సిన డేటా పెద్ద మొత్తంలో ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆధార్‌ అధికారులు నాలుగు రోజుల క్రితం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

ఐటీశాఖకు శర్మ లేఖ: ఐటీ గ్రిడ్‌ ఆశోక్‌కు బిగిస్తున్న ఉచ్చు