‘వాహ్.. వాట్ ఏ స్కీమ్.. చీప్ లిక్కర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానామా?’.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్లు
విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికంగా స్పందించారు.
విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే తక్కువ ధరకే చీఫ్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు మండిపడుతున్నారు. సోము వీర్రాజుకు మతి భ్రమించినట్లుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇకపై ఆయన్ను సారాయి వీర్రాజుగా పిలవాలేమో అంటూ సెటైర్లు వేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికంగా స్పందించారు. ఏపీ బీజేపీ మరింతగా దిగజారిపోయిందని విమర్శించారు. ‘వాహ్.. వాట్ ఏ స్కీమ్! వాట్ ఏ షేమ్.. ఏపీ బీజేపీ కొత్త పతనానికి దిగజారింది.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానమా?.. నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఇస్తున్నారా..?’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇక, వైఎస్ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ మంగళవారం విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు.. జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బీజేపీకి అధికారమిస్తే అమరావతిని మూడేళ్లలో నిర్మిస్తామని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ.. చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతుందని విమర్శించారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో లేవని ఆరోపించారు. Special Status, Governor’s Medal.. వంటి లేబుల్స్‌తో మద్యం విక్రయిస్తున్నారని అన్నారు.
ఏపీలో బ్రాండెడ్ మద్యం లేదని విమర్శించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ. 12 వేలు రాబట్టి.. మళ్లీ సంక్షేమ పథకాలపేరుతో వారి అకౌంట్లలోనే వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మందుబాబులకు రూ. 70 కే చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పారు. ఇంకా రెవెన్యూ బాగా ఉంటే.. రూ. 50 వేస్తామని హామీ ఇచ్చారు.